నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్

పయనించే సూర్యుడు మార్చి 22 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ-26వ వార్డులో విద్యుత్ అధికారులు మరియు మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ వైస్ ఛైర్మన్ గంధం నరేందర్ గుప్తా ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ గృహ అవసరాలకు మరియు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నూతన ట్రాన్స్ఫర్లను ప్రారంభించడం జరుగుతుందని పాత ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడటం వల్ల వచ్చే లో-వోల్టేజ్ సమస్యలను అరికట్టడానికి నూతన ట్రాన్స్‌ఫార్మర్లు దోహదపడతాయని అని అన్నారు విద్యుత్ శాఖ అధికారులు మున్సిపాలిటీ పరిధిలో నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రజలకు అంతరాయం లేని సరఫరా ఉండేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ హనుమకొండ శ్రీధర్ మండల శ్రీదేవి శ్రీనివాస్ పొన్నాల మనిషా ప్రకాష్ బాణాల ప్రసన్న శ్రీనివాస్ శ్రీరామోజు రోజా రాణి ఇస్లావత్ రామ గోపి వేల్పుల శ్రీలత విద్యుత్ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు