పెద్దకడబూరులో గ్యాస్ సరఫరాపై అపోహలు వద్దు

మండల ఎంఆర్వో గీత ప్రియదర్శిని సూచించారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 22 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలంలో వంట గ్యాస్ సరఫరాపై ప్రచారం జరుగుతున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని మండల ఎంఆర్వో గీత ప్రియదర్శిని సూచించారు. ఇటీవల గ్యాస్ సరఫరా విషయంలో కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా అధికారుల సూచనలు పాటించాలని కోరారు. అపోహలకు లోనై గ్యాస్ గోదాముల వద్దకు వెళ్లి గుంపులుగా చేరి ఇబ్బందులు కలిగించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు క్రమం ప్రకారం సరఫరా జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదే సమయంలో గ్యాస్ ఏజెన్సీలు బుక్ చేసిన వారికి సరఫరా చేయకుండా పక్కదారి పట్టించినా, లేదా అదనపు వసూళ్లు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా చోటుచేసుకుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ప్రజలు సహకరించి, అపోహలను పక్కన పెట్టి అధికారులకు సహాయపడాలని ఆమె కోరారు.