పెద్దకడబూరు ఈద్గా వద్ద ముస్లింల ప్రార్థనలు

ఈ కార్యక్రమానికి టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పాల్గొన్నారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 22 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలంలో శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామ శివారులోని ఈద్గాల వద్ద ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని నమాజు చేశారు. ప్రార్థనల అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, సొసైటీ ఛైర్మన్ మీ సేవ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వస్తాదు అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతు, పవిత్ర రంజాన్ పర్వదినం మనకు సహనం, క్షమ, దానం వంటి విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్లా అడుగు జాడల్లో నడుచుకుంటూ సత్ప్రవర్తనతో జీవించాలని సందేశమిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు