పెసా చట్టంపై అవగాహన సదస్సుకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.22.2026 పెసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఈ నెల 24 వ తేదీన ఉదయం 10 గంటలనుండి రంపచోడవరం ఐటీడీఏ మీటింగ్ హాల్ నందు. జరిగే సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలి. పెసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు తెల్లం శేఖర్ పిలుపు. పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం, పోలవరం జిల్లా ప్రధాన కేంద్రమైన రంపచోడవరం ఐటీడీఏ మీటింగ్ హాల్ నందు 24 వ తేదీన పెసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులతో పోలవరం జిల్లా కలెక్టర్ మరియు రంపచోడవరం ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో పెసా చట్టంపై అవగాహన కల్పించడానికి ముఖ్యఅతిథిగా. అడ్వకేట్, డాక్టర్ పి.త్రినాధరావు వస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పెసా గ్రామసభల నిర్వహణ మరియు లీగల్ విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.కావున ఈ నెల 24వ తేదీన మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు రంపచోడవరం ఐటీడీఏ మీటింగ్ హాల్ నందు జరిగే అవగాహన సదస్సుకు గుర్తేడు, మారేడుమిల్లి, రంపచోడవరం, దేవీపట్నం ఈ నాలుగు మండలాలలో సెలెక్ట్ అయిన పెసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులు తప్పనిసరిగా అందరూ హాజరుకావాలని పెసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యలగాడ నాగేశ్వరరావు ,కారం రామన్న దొర మరియు పెసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులు మొదలైన వారు పాల్గొన్నారు.