ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు విజయవంతం

నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 22 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధమ మహాసభలు అశ్వారావుపేట మండల కేంద్రంలో శ్రీ సత్య సాయి కళ్యాణ మండపంలో విజయవంతమయ్యాయి. ఈ మహాసభలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గోకినపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా జాటోత్ కృష్ణ, కోశాధికారిగా బుర్రా వెంకన్న ఉపాధ్యక్షులుగా దాసరి సాయి, సహాయ కార్యదర్శిగా నాయిని రాజు, కార్యవర్గ సభ్యులుగా తెల్లం రాజు, బానోతు లింగా, మంచినీల్ల భాస్కర్, ఎం రాజశేఖర్, కంగాల వెంకటమ్మ, కుర్సం ముత్యాలరావు, శాస్త్రబోయిన వెంకటేశ్వర్లు, పోతుగంటి లక్ష్మణ్, కాకా వెంకటేష్, బండి వెంకటమ్మ, చింతకాయల సరళ లతో కలిపి 17 మందితో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గం కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పాత పేరునే కొనసాగించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో సంవత్సరానికి రూ.12,000.లు ఇచ్చే కార్యక్రమాన్ని వెంటనే నెరవేర్చాలని, కనీస వేతన చట్టాన్ని సవరించి వెంటనే అమలు చేయాలని, పొడుభూముల సమస్యలు పరిష్కరిస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోగా పోడు సాగుదారులపై దాడులు చేయటాన్ని నిరసిస్తూ, వెంటనే పోడు భూములకు పట్టా హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహాసభ తీర్మానించింది. ఈనెల 24 25 తేదీలలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని మహాసభ ప్రజలకు పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *