పయనించే సూర్యుడు మార్చి 22 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల గిరిజన సర్పంచులు ఈరోజు తన చిన్ననాటి మిత్రుడు, మాజీ సర్పంచ్ రాజు నాయక్ ఇటీవల గుండె బైపాస్ శస్త్రచికిత్స చేయించుకుని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా గిరిజన సర్పంచులు, మాజీ సర్పంచులు మరియు నాయకులు కలిసి ఆయనను పరామర్శించి మనోధైర్యం నింపారు.
గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తై ఆరోగ్యంగా కోలుకుంటున్న రాజు నాయక్ గారిని చూసి స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. పునర్జన్మ పొందినట్టుగా భావిస్తూ బాల్యమిత్రులు ఒకరినొకరు కౌగిలించుకొని భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమంలో గోవిందు నాయక్, చందూలాల్, పుల్య నాయక్, మునీందర్, గోపాల్ నాయక్, రవి నాయక్, భాషా నాయక్, హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.