బీఆర్ఎస్ కు చెందిన కాంగ్రెస్ లో చేరిన పర్లపల్లి సర్పంచ్ఎమ్మెల్యేడాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ.

పయనిమచె సూర్యుడు న్యూస్: మార్చి/22: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం:కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామ సర్పంచ్ సూరం స్వప్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కు చెందిన స్వప్న, ఆమె భర్త మహేందర్ రెడ్డి, 1వ వార్డు సభ్యురాలు గొట్టిముక్కుల స్వరూప, 8వ వార్డు సభ్యురాలు వీరేండ్ల రజిత, 11వ వార్డు సభ్యురాలు కరివేద రవళి తోపాటు రెడ్డి సంఘం అధ్యక్షుడు గునుకుల మల్లారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం పర్లపల్లి గ్రామంలో వివో భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేయడానికి ముందు వీరికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు స్వప్న మహేందర్ రెడ్డి ప్రభృతులు చెప్పారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేష్, బ్లాక్ అద్యక్షుడు ఎస్ ఎల్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, మాజీ ఎంపీపీ రాజేందర్ రెడ్డి, పర్లపల్లి ఉప సర్పంచ్ గొట్టముక్కల సంపత్ రెడ్డి, పార్టీ నాయకులు బుదారపు శ్రీనివాస్ ,గోగూరు నరసింహారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, వరాల అనిల్, పోతుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.