పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 22 బోధన్ : బోధన్ ముస్లిం మైనార్టీ సోదరులు శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకొని పండగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఉదయాన్నే ముస్లిం మైనార్టీ సోదరులు ఈద్గాల వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్బంగా 34వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ మూషీర్ బాబా కు పట్టణ సిఐ వెంకట నారాయణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరిని ఒకరు అలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల పెద్దలు, ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నాయకులు ఈద్గాల వద్దకు వచ్చి ముస్లిం మైనార్టీ సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.