భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 22.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండల వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు పట్టణంలోని మేధార దొడ్డి సంత గేటు నుంచి ముస్లిం సోదరులు ర్యాలీగా చె డుుకుట్లపల్లి రోడ్డు వైపు ఉన్న ఈద్గా వద్దకు చేరుకున్నారు అక్కడ మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు ఆ లింగం చేసుకొని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు అదేవిధంగా దాదేపల్లి ఖాన్ సాబ్ మెట్ట గుట్టపల్లి ఏ కొత్తకోట కోటూరు అంగుతోటపల్లి మర్రిమాకులపల్లి కాగతి తదితర గ్రామాల్లోనూ ముస్లిం సోదరులు ఈద్గా మసీదులలో ప్రార్థనలు చేశారు