పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 22.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం, ఇందుకూరుపేట నాన్ ట్రైబల్స్ భూ అక్రమాలకు,అక్రమ కట్టడాలకు నిలయంగా మారిందని.ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… బహుళ అంతస్తు బిల్డింగులు,భారీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన వారికి ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి. ముఖ్యంగా 1/70 చట్టానికి తూట్లు పొడిచి విద్యుత్ మీటర్లకు ఎఎన్ఓసి లు ఇచ్చిన పంచాయతీ, రెవెన్యూ అధికారులకు, విద్యుత్ మీటర్లు జారీ చేసిన విద్యుత్ అధికారుపై క్రిమినల్ కేసులు నమోదు. చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలు మొదలవుతున్నప్పుడు.నుండి ఆదివాసి సంక్షేమ పరిషత్ ఫిర్యాదులు.చేస్తూ వస్తున్నప్పటికీ స్థానిక పంచాయతీ రెవెన్యూ అధికారులు.ముడుపులకు అలవాటు పడి చూసి,చూడనట్టు వదిలేస్తున్నారని. పీజిఆర్ఎస్లో దరఖాస్తు చేస్తున్నప్పటికీ.ఉన్నతాధికారులు కూడా అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వెయ్యకపోవటం. బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఎల్.టి.ఆర్.పి కేసులు నమోదు.చేసినప్పటికీ వాయిదాలు మీద వాయిదాలు వేస్తూ రావడంతో ఈ సమయాలని నాన్ ట్రైబల్స్ అవకాశంగా చేసుకుంటూ .అక్రమ నిర్మాణాలను పూర్తిచేసి, దర్జాగా వారి వ్యాపారాలు వారు చేసుకుంటున్నారని. ఆయన మండిపడ్డారు. ఏజెన్సీలో చట్టాలను రక్షించాల్సినటువంటి కలెక్టర్,ఐటీడీఏ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో. రెవిన్యూ పంచాయతీ అధికారులు ముడుపులకు అలవాటు పడి ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ. ఆదివాసి చట్టాలను నాన్ ట్రైబల్స్ కి చుట్టాలుగా మారుస్తున్నారని.ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలు చేయకుండా.నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని. ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్, యాలగడ్డ నాగేశ్వరరావు, కంగాల అబ్బాయి దొర, చోడి ఏడుకొండలరావు తదితరులు పాల్గొన్నారు. కుంజ శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.