
పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి/22:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సాధికారతే అత్యంత కీలకమని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వివో భవనం పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా సాధికారతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న రేవంత్ ప్రభుత్వం మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నదని, ఇప్పటి వరకు మూడు పర్యాయాలు వడ్డీ లేని రుణాలు అందించినట్టు చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం బడ్జెట్‌లో మహిళా సంఘాలకు పెద్ద పీట వేసిందన్నారు. రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్హోత్ర, పర్లపల్లి గ్రామ సర్పంచ్ సూరం స్వప్న మహేందర్, ఉప సర్పంచ్ గొట్టుముక్కుల సంపత్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ శ్రీలత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్, పర్లపల్లి గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు కాసర్ల సంపత్, పార్టీ నాయకులు మోరపల్లి రమణారెడ్డి, గోగూరి నరసింహారెడ్డి, మామిడి అనిల్ కుమార్, బుదారపు శ్రీనివాస్, పిట్టల రవి తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్వేట్ హాల్ ప్రారంభం తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పీసీఆర్ బ్యాంక్వేట్ హాల్ ను శనివారం మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మండల రమేష్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఎల్ గౌడ్, పార్టీ నాయకులు మోరపల్లి రమణారెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, బుదారపు శ్రీనివాస్, మామిడి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.