మాధవరంలో రంజాన్ వేడుకలు

★ ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్రారెడ్డి ★ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నమాజు చేశారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 22 రిపోర్టర్ అభి మాధవరం గ్రామంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్రారెడ్డి పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నమాజు చేశారు. అనంతరం వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ త్యాగం, సహనం, పరస్పర సహకారం వంటి విలువలను తెలియజేస్తుందని పేర్కొన్నారు. మైనార్టీ సోదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, సామాజిక భద్రత రంగాల్లో మైనార్టీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం మైనార్టీల కోసం ప్రత్యేక నిధులను విడుదల చేసి, వారి అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ, పరస్పరం శుభాకాంక్షలు పంచుకున్నారు.