మీ సేవలు మరువలేనివి.. సర్పంచులకు ఘన సత్కారం ..ఎమ్మెల్యే నానాజీ సహకారంతో గ్రామాల అభివృద్ధి చేసాం.. సర్పంచులు..

పయనించే సూర్యుడు మార్చి 22, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఏప్రిల్ రెండో తేదీతో ముగియనున్న సర్పంచుల కాలం గత ఐదు సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధిలో అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లిన సర్పంచులకు శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, ఎంపీడీవో సతీష్, ఈవో పీఆర్డి శ్రీరామ ఆంజనేయులు వైస్ ఎంపీపీ విరిసా సత్తిబాబుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపుమేరకు ఘనంగా సర్పంచులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన సేవలను కొనియాడుతూ వీడ్కోలు పలికారు. ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచులు పండూరు గ్రామ సర్పంచ్ వలవల అమ్మాజీ, గంగనాపల్లి గ్రామ సర్పంచ్ గిసాల మహాలక్ష్మి, కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా, పెనుమర్తి గ్రామ సర్పంచ్ పెంకే ఆనందరావు, సర్పవరం గ్రామ సర్పంచ్ సీలం నాగేశ్వరరావు, పి వెంకటాపురం పెంకే సోమరాజులను పూలదండ వేసి దుస్సాలువలతో మెమొంటో గిఫ్ట్లుఅందజేసి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం సర్పంచులు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధిలో మా వంతు కృషి చేయడం జరిగిందని అందుకు ఎమ్మెల్యే పంతం నానాజీ తో కలిసి పని చేసినందుకు సంతోషంగా ఉన్నామని గ్రామాలు అభివృద్ధి దశలో ముందుకు పోతున్నాయని అన్నారు. అనంతరం ఎండిఓ సతీష్ వచ్చిన వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు,వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.