ముట్టడి ముందు అరెస్టులు ఆశ వర్కర్లు ఆగ్రహం చెరరేగింది

"ఆశ వర్కర్ల డిమాండ్లను వెంటనే అమలు చేయాలి"

పయణించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ ఓబుల్ రెడ్డి మార్చ్ 22 మాచారెడ్డి మండల కేంద్రంలో సోమవారంఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆశ వర్కర్లు తలపెట్టిన మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం సందర్భంగా భారీగా చేరుకున్న ఆశ కార్యకర్తలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మాట్లాడుతూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా అణచివేత విధానాలు అవలంబించడం సరైంది కాదని మండిపడ్డారు. మంత్రుల ఇళ్ల ముట్టడికి వెళ్తున్న ఆశ వర్కర్లను పోలీసులు అడ్డుకుని, బలవంతంగా అరెస్టులు చేయడం ఉద్రిక్తతకు తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. ఈ అరెస్టులపై ఆశ వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. “ఎన్ని అరెస్టులు చేసినా, తప్పకుండా అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేస్తాం” అంటూ హెచ్చరించారు. ఆశ వర్కర్ల పోరాటం మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లు మరింత బలపడుతున్నాయి.

చుక్కాపూర్ ఐలమ్మ విగ్రహ నిర్మాణానికి శుభారంభం

"రజక సంఘం ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ భూమి పూజ" మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో శుక్రవారం గొప్ప ఆధ్యాత్మిక–సామాజిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మడివేలు రజక సహకార సంఘం ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ విగ్రహ స్థాపన కోసం భూమి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు సాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు, ఆమె సామాజిక న్యాయం కోసం చేసిన త్యాగాలు, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమం గురించి వివరంగా తెలియజేశారు. ఆమె జీవిత గాథ నేటి తరాలకు గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పాలకవర్గ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు ద్వారా ఆమె సేవలను చిరస్థాయిగా నిలబెట్టాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తూ, సామాజిక చైతన్యానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. నూతనకల్ గ్రామంలో నారపోగు జమలయ్యను పరామర్శించిన సండ్ర చుక్కాపూర్ గ్రామంలో , మాజీ వార్డ్ మెంబర్ రుక్మిణి భర్త పమ్మి రాజ్ కమల్ మార్చి ఎనిమిదో తారీఖున అనారోగ్యం కారణంగా స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు శుక్రవారం నూతనకల్ గ్రామంలో మాట్లాడి, వారిని ఓదార్చి ధైర్యం చెప్పి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు , కార్యదర్శి దుగ్గిదేవర వెంకట లాల్, పెనుబల్లి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు , తల్లాడ టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు , మాజీ సర్పంచ్ మరియు ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు