పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 22 మామిడిపెల్లి లక్ష్మణ్ పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని, స్థానిక ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనల అనంతరం వారిని ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. "రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి సోదరభావానికి ప్రతీక అని, మనమందరం కలిసిమెలిసి ఉండటమే మన సమాజ గొప్పతనమని" పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కౌన్సిల్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ వేడుకల్లో స్థానిక ముస్లిం పెద్దలు, యువకులు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.