ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన కోడి బ్రదర్స్

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 22. చండూరు మున్సిపల్ పట్టణంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు కోడి బ్రదర్స్ శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలియజేశారు. ఉపవాస దీక్షల పవిత్రతను కొనియాడుతూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, శాంతిసౌభ్రాతృత్వంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని కోరారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని, అలాగే మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని కోడి బ్రదర్స్ తెలిపారు . ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం,రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, వారి సంక్షేమానికి ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయించి, ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ అలాయ్ బలేయ్ చేస్తూ కులమతములకు అతీతంగా చండూర్ పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటూ ప్రార్థన చేశారు. ఇట్టి ఈ క్రమంలో మాజీ సర్పంచ్ కోడి. గిరిబాబు , చండూరు మున్సిపల్ చైర్మన్ డా:, కోడి శ్రీనివాసులు , వైస్ చైర్మన్ భూతరాజు దశరథ , కౌన్సిలర్లు కోడి, సుష్మ వెంకన్న , బుషిపాక వాసు, కటకం రమేష్, ఐతరాజు మల్లేష్, మాస కృష్ణ, బోడ వెంకటేష్, సరికొండ వెంకన్న, పున్న సైదులు, ఏకలపు ఆంజనేలు, బోడ విజయ్, ముస్లిం మత పెద్దలు మొలిసాబ్ , ఖమ్రూ, ఖలీల్, సాధక్, హైమద్, జావీద్, నిరంజన్ అలీ, ఎజస్, వహీద్, ముజ్జు, జమీల్, షరీఫ్, గౌస్, చాంద్ పాషా, రషీద్,, రహీం బాబా, సమీర్, కరంట్ శేరిఫ్, సజ్జు,జన్ను, నజీర్, ముజిబ్, బషీర్, జాఫర్, అఖిల్, సర్వర్, జబ్బర్, సత్తార్, లతీఫ్, జాని ,నాసర్, ఫయుం, ఖయ్యూం, అలిం, గౌస్, ఇస్మాయిల్, అబ్దుల్, రఫీ ,ఇమ్రాన్, అజిమ్, అదిల్, ఫెరోజ్, జావీద్, అక్రమ్, మోబిన్, యువత తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *