మెట్‌పల్లిలో ఈద్ ముబారక్ వేడుకలు – నాయకులకు ఆతిథ్యం

పయనించి సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 22 మెట్‌పల్లి పట్టణంలోని 7వ వార్డులో ఈద్ పండుగ సందర్భంగా ఆత్మీయ వాతావరణంలో ఈద్ ముబారక్ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ జాకీర్ తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను ఆహ్వానించి సంప్రదాయ పద్ధతిలో విందు ఏర్పాటు చేసి, ఆతిథ్యం అందించారు. అనంతరం అబ్దుల్ జాకీర్, జువ్వాడి కృష్ణారావు మరియు ఓంకార నవీన్‌లకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈద్ పండుగ సోదరభావం, ప్రేమ, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా పండుగలను జరుపుకోవడం సమాజానికి శ్రేయస్కరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు మరియు కాలనీవాసులు పాల్గొని పరస్పరం ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.