మైనింగ్అధికారుల నిర్లక్ష్య వైఖరి,ఆగని “మట్టి మాఫియా” ఆగడాలు

పయనించే సూర్యుడు మార్చి 22 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం:

ఖమ్మం చుట్టు పక్కల ప్రాంతాల్లో “మట్టి మాఫియా” ఆగడాలు రోజు రోజుకు పెచ్చు మీరుతున్నాయి,మట్టి మాఫియా ఆగడాలకు రహదారులు రక్తమోడుతున్నప్పటి సంబధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, మైనింగ్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో మట్టి వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు, ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి త్రవ్వకాలు చేపట్టడం, అక్రమంగా త్రవ్విన మట్టిని బయటకు తరలించే క్రమంలో మట్టి లోడుతో నిండిన ట్రిప్పర్లు పోలీసులు, మైనింగ్ అధికారుల కంటబడకుండా ఉండటం కోసం మితిమీరిన వేగంతో రోడ్లపై స్వైర విహారం చేస్తున్నాయి,ఈ కార్యక్రమంలో తాజాగా రఘునాథపాలెం మండలం ఖమ్మం,ఇల్లందు ప్రధాన రహదారి యాపిల్ సెంటర్ వద్ద పట్ట పగలు అందరూ చూస్తుండగానే వైఎస్సార్ కాలనీ వైపు నుండి మట్టి లోడుతో నిండిన వాహనం అతి వేగంగా వచ్చి పక్కన బైకు మీద వెళుతున్న ఖానాపురంనకు చెందిన కృపాదాస్ అనే వ్యక్తిని ఢీకొట్టడంతో స్వల్ప గాయాలతో బయట పడటంతో స్వయంగా ప్రమాదాన్ని చూస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు

ప్రమాదం జరిగిన విధానం

ఆ తర్వాత యాక్సిడెంట్ చేసి వాహనం ఆపకుండా వెళుతున్న డ్రైవరును,వాహనాన్ని స్థానికులు ఆపారు,ఆపిన క్రమంలో స్థానికుల అడిగిన ప్రశ్నలకు డ్రైవర్ చెప్పిన నిర్లక్ష్యపు సమాధానాలు విన్న స్థానికులకు మైండ్ బ్లాంక్ అయింది,ఈ వాహనం ఎవరిదో తెలుసా,ఆయన సంగతి మీకు తెలుసా,ఆయన్ని అధికారులు,మీరు ఏం చేయలేరు,కేసు పెట్టుకోండి ఐదు నిమిషాల్లో బయటకు వస్తా అంటూ ఖమ్మం నగరం ఎనిమిదో డివిజనుకు చెందిన ఓ మట్టి వ్యాపారి పేరు చెప్పడం విశేషం,వాస్తవానికి సదరు మట్టి వ్యాపారికి రఘునాథపాలెం మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులతో పాటు రెవెన్యూ,మైనింగ్,పోలీసు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది, ముఖ్యంగా రఘునాథపాలెం మండలంలో అన్ని తానై వ్యవహరించే జిల్లాకు చెందిన ఓ మంత్రికి సంబంధించిన ఇద్దరు ప్రధాన అనుచరుల కనుసన్నల్లోనే సదరు వ్యాపారి తన కార్యకలాపాలు నిర్వహిస్తాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి, ఇది ఇలా ఉంటే ఈ మొత్తం వ్యవహారంలో లోడు బండి యాక్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్లో మాత్రం ఖాళీ బండి పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది, ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు నేరుగా పోలీసు స్టేషనుకు తరలించారు కానీ మధ్యలో మట్టి ఎలా మాయం అయిందనే దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవరుపై కేసు నమోదు చేసారు కానీ అసలు పోలీసులు కస్టడీలో ఉన్న వాహనంలో ఉన్న మట్టి ఎలా మాయం అయిందనే అంశంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి

ప్రమాదానికి కారణమైన మట్టి టిప్పర్

సదరు వ్యాపారిపై మైనింగ్, రెవెన్యూ అధికారులకు వల్ల మాలిన ప్రేమ ఎందుకంటే స్థానిక మెడికల్ కాలేజీ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నివాస యోగ్యమైన ప్లాట్లు కేటాయించే క్రమంలో బల్లెపల్లి రెవెన్యూ పరిధిలోని 146,147,148 సర్వే నెంబర్లో కొంత భూమిని చదును చేసి నిర్వాసితులకు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది దాన్ని ఆసరగా తీసుకుని అధికార పార్టీ నాయకులు,మైనింగ్, రెవెన్యూ అధికారులు కూడబలుక్కుని ఏటువంటి టెండరు పిలవకుండా సదరు వ్యాపారి భార్య పేరు మీద అక్రమ అనుమతులు ఇచ్చి దాదాపు నలభై రెండు ఎకరాలకు పైగా చదును చేసే నెపంతో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని బయటకు తరలించి ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చారు,ఈ అక్రమ మట్టి తవ్వకాలపై మైనింగ్ అధికారులను ప్రశ్నిస్తే రెవిన్యూ అధికారులు యాన్ ఓ సి ఇచ్చారు మేము అనుమతులిచ్చాం మాకేం సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం,మాకు రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని చెప్పడంతో పాటు ఒకానొక సమయంలో స్వయంగా మంత్రి పోన్ చేసి సదరు వ్యాపారికి మట్టి త్రవ్వకాలకు అనుమతులు ఇవ్వమని చెప్పడంటూ చెప్పడం విశేషం, వాస్తవానికి ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో మంత్రి ఎవరికి వ్యక్తిగత రికమండేషన్స్ చేయడనే పేరుంది,ఆ తరువాత ఈ విషయం గురించి విచారణ చేస్తే ప్రశ్నించినోళ్లను బెదరగొట్టడం కోసం అధికారులు మంత్రి పేరును ఉపయోగించినట్లు తెలిసింది

ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన ద్విచక్ర వాహనం

అంతే కాకుండా సదరు వ్యాపారి ఖాళీగా ఉంటే మైనింగ్ అధికారులకు నిద్ర పట్టదనుకుంటా ఎందుకంటే మండల పరిధిలోనీ ఈర్లపూడి క్వారీ లీజు ఈరోజుతో ముగుస్తుండడంతో మైనింగ్ అధికారులు హడావిడిగా గతంలో త్రవ్వకాలు జరిపిన మెడికల్ కాలేజీ వెనుక భాగంలో తిరిగి మట్టి తవ్వకాల కోసం మూడు రోజుల క్రితం టి పి లు ఇచ్చినట్లు సదరు వ్యాపారి బయట చెప్పడం విశేషం, ఏది ఏమైనా అధికార పార్టీ నాయకులు,రెవెన్యూ, మైనింగ్ అధికారుల అండదండలు ఉన్నంతకాలం “మట్టి మాఫియా” ఆగడాలకు అడ్డూ అదుపు ఉండదనేది స్థానికుల అభిప్రాయం,ఈ అక్రమ లీజులు మంజూరి చేసే విషయంలో స్థానిక మంత్రి దృష్టి సారిస్తే ఆయన పేరు ఉపయోగించుకుని,ఆయనకు చెడ్డపేరు తెచ్చే నాయకులు,వాళ్లకు సహకరించే అధికారుల బాగోతాలు బయట పడతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *