యుటిఎఫ్ కార్యాలయాని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్య ప్రభ

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 22 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):ఏలేశ్వరం పట్టణంలో ఇటీవల ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ,ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి యుటిఎఫ్ కార్యాలయం ప్రారంభించారు.ఈ మేరకు ఎర్రవరం జడ్పిపి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.కన్నబాబు సొంత నిధులతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) ఏవీఎస్ అండ్ విఎస్సార్ టీచర్స్ హోమ్ కు 50 కుర్చీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చెదులూరి సూరిబాబు, జిల్లా కార్యదర్శులు జట్ల సోమరాజు, అనిశెట్టి సీతారామరాజు,మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *