పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ) మార్చి 22 మెట్ పల్లి పట్టణంలోని వెంకట్రావు పేట లోని ఈద్గా పనులు ఈసారి రంజాన్ కు అదరహో అనిపించినాయి. ప్రతి సంవత్సరం జరుపుకునే రంజాన్ పండుగకు ప్రతి సంవత్సరం చాలి చాలని టెంట్లు మరియు తాగడానికి కనీస నీటి సదుపాయం కూడా ఉండేది కాదు కానీ ఈసారి కొత్త పాలకవర్గంలో కొత్త పనులు శ్రీకారం చుట్టాయి. 12వ వార్డు అయిన ముఖిమ్_ సుమయ్య తబస్సు మ్ ఆధ్వర్యంలో తాగడానికి బిస్లరీ నీరు, మరియు ప్రతి ముస్లిం సోదరులుకు మరియు సోదరీమణులు ఖర్జూర పండ్లను పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం నమాజ్ చేయడానికి వచ్చిన ముస్లిం సోదరులకు మరియు చిన్నపిల్లలకు చాలీచాలని టెంట్లు లో నమాజు చేసేవారు. కానీ ఈ సంవత్సరం కొత్త పాలకవర్గంలో ప్రతి ముస్లిం సోదరులు మరియు చిన్న పిల్లలు అలాగే పట్టణ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈద్గా మొదలు నుండి చివరి వరకు చుట్టుప్రక్కల టెంట్ వెయ్యడం వలన ఎండలో కాకుండా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు నీడలో. నమాజ్ చేశారు అలాగే తాగడానికి మంచినీటి సరఫరా మరియు క్రింద కూర్చోవడానికి మ్యాట్ లు కూడా వేయించడం జరిగింది. ఇంత పవిత్రతకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ నర్సింగరావుకు, మరియు మున్సిపల్ చైర్ పర్సన్ మైలారపు లింబాద్రి కి, వైస్ చైర్ పర్సన్ ఓంకారి నవీన్ కు, మున్సిపల్ కమిషనర్ స్పందన మేడంకు, అలాగే ఎటువంటి అవాంఛన ఘటనలు జరగకుండా బందోబస్తు చేసిన పోలీస్ సిబ్బందికి మెట్టుపల్లి ముస్లిం సోదరులు కృతజ్ఞత భావం తెలిపారు. ముఖ్యంగా 12వ వార్డు కౌన్సిలర్ అయిన ముఖిమ్ – సుమయ్య తబ స్సుమ్ మరియు 12 వ వార్డు ప్రజలు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖిమ్ మహమ్మద్ రైస్, లతీఫ్, మసూద్ మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు పాల్గొన్నారు.