
పయనించే సూర్యుడు, మార్చి 22 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎం కుమార్ పవిత్ర రంజాన్ పండుగ పర్వదిన శుభ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తా ఖాజా నగర్ లోని ఈద్గాలో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమా నికి డివిజిన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ విచ్చేసి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనల కార్యక్రమంలో పాల్గొన డం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ గారు మాట్లాడుతూ ఎల్లమ్మబండ ఈద్గా వేలమంది ముస్లిం సోదరులు ఒకే చోట ప్రార్ధనలు చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉందని,ఈద్గా అభివృద్ధికి మీ అందరితో పాటు ముందుండి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు,దెైవ ప్రార్థన లతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.సహనా న్ని, దానదయా గుణాన్ని, సోదరభావా న్ని, శాంతి సామరస్యాలను పెంపొందిం చే పవిత్ర పర్వదినం రంజాన్ ను ముస్లిం సోదర సోదరీమణులందరు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు పట్వారి శశిధర్, గోపాల్, నీరుడి రాజు, గుడ్ల శ్రీనివాస్, లింగం, సుధాకర్, మోజెస్,బుల్లెట్ రవి తదితరులు పాల్గొన్నారు.