రమదాన్ పండుగకై ఈద్గా లో ప్రార్థన చేసిన ఆల్ ఇండియా తౌహీద్ జమాత్

పయనించే సూర్యుడు మార్చి 22 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఉదయం తెల్లవారుజామున ఏడు గంటలకు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్న ఆల్ ఇండియా తౌహీద్ జమాత్ సభ్యులు ఈ రమలాన్ ప్రత్యేక ప్రార్థనల పై ఉదయాన్నే ఏడు గంటలకు సూళ్లూరుపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర ప్రైవేట్ ఆవరణలో ఈద్గా ప్రార్ధనలను నెరవేర్చుకున్నారు ఈ సందర్భంగా ఈ రమలాన్ పండుగ యొక్క ప్రత్యేకత దీనివలన ప్రపంచ మానవాళికి కలిగే మంచి గురించి ప్రసంగం చేసిన ఏఐటిజె దక్షిణ మండల ప్రెసిడెంట్ కేయం బషీర్ ఈ ప్రార్ధనలను ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రపంచ మానవాళి శాంతిని కోరుకుంటుందని శాంతియుతంగా ప్రస్తుత యుద్ధ సమస్యలను పరిష్కరించుకొని ప్రజలకు మేలును చేకూర్చే విధంగా అందరూ కృషి చేయాలని అలాంటి పరిష్కారాలు జరిగే దిశగా అందుకొరకై మనమందరం ప్రత్యేకంగా ప్రార్ధనలు చేయాలని కోరుకున్నారు