రామవరంలో వైఎస్సార్‌సీపీ గ్రామ, బూత్ కమిటీల ఎంపిక పూర్తి.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 22 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో పార్టీ సంస్థాగత బలోపేతానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో పార్టీ గ్రామ కమిటీతో పాటు అనుబంధ విభాగాలు మరియు పోలింగ్ బూత్ కమిటీల ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కమిటీలకు సంబంధించిన వివరాలను గ్రామ నాయకులు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి అందజేశారు. అతి తక్కువ సమయంలో కమిటీల నిర్మాణం: ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రామవరం గ్రామంలో పార్టీ నిబంధనలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకతతో కమిటీలను రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎంతో తక్కువ సమయంలోనే అన్ని కమిటీలను సమర్థవంతంగా పూర్తి చేసి అందించడం పార్టీ పటిష్టతకు గొప్ప ఉదాహరణ అని ఆయన కొనియాడారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ కమిటీలు పని చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో సభ్యుల ఎంపిక: గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం 126 మంది సభ్యులతో గ్రామ కమిటీని రూపొందించారు. అదేవిధంగా గ్రామంలోని నాలుగు పోలింగ్ బూత్‌లకు గాను, ప్రతి బూత్‌కు 11 మంది చొప్పున మొత్తం 44 మంది సభ్యులను ఎంపిక చేశారు. ఈ కమిటీల్లోని సభ్యుల పూర్తి వివరాలు, ఫోటోలు, ఆధార్ మరియు ఓటర్ ఐడి కార్డులను సేకరించి పక్కాగా నమోదు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), పంచాయతీ వార్డు సభ్యుడు తాడేల వెంకన్న, మండల పార్టీ కార్యదర్శి కర్రి గాంధీ రెడ్డి, గ్రామ బీసీ సెల్ అధ్యక్షుడు మంతిన అప్పారావు, గ్రామ యువజన విభాగం అధ్యక్షుడు చింతా ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు పులగం వెంకటరెడ్డి, కర్రి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కె. తేజా పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.