రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం

★ బిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 22 బోధన్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి అన్యాయం చేసిందని బిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంజయ్ అన్నారు. ఈ బడ్జెట్లో విద్యారంగానికి పట్టుమని 10% కూడా అందించకపోవడం దారుణం అన్నారు ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్పారు కానీ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.26 వేలకోట్లతో సరిపెట్టడం సరికాదన్నారు. ఈ బడ్జెట్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు అదేవిధంగా ప్రభుత్వ హాస్టలను అభివృద్ధి చేయడానికి 100 కోట్లే కేటాయించిందని వాపోయారు. వెంటనే ప్రభుత్వం బడ్జెట్ సడలించి విద్యారంగానికి కొఠారి కమిషన్ ప్రకారం 30% నిధులు కేటాయించాలన్నారు. తాజా బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించిన శాతం కేవలం 8 .2% మాత్రమే ఉండటం, కొఠారి కమిషన్ ప్రకారం 30% ప్రమాణంతో పోలిస్తే చాలా తక్కువ. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే వెంటనే విద్యారంగానికి కేటాయింపులు పెంచి. కనీసం 25% శాతం వరకు పెంచాలి, యూనివర్సిటీలు, గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.