రౌడీయిజం చేసే వారికి భయపడకండి : మీకు అండగా నేనున్నాను:- ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి

పయనించే సూర్యుడు మార్చి 22 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ ఆదోని నియోజకవర్గం లో రౌడీయిజం చేస్తున్నవారికి ఎవ్వరు కూడా భయపడకండి అని మీకు అండగా నేనుంటానని ఆదోని శాసనసభ్యులు పార్థసారధి అన్నారు, గణేష్ సర్కిల్లో పర్యటించిన ఆయన గత కొద్ది రోజుల కిందట వెంకటేశ్వర మెడికల్ షాప్ యాజమాని రాఘవేంద్ర పై జరిగిన దాడిని ఖండిస్తూ, ఆదోనిలో ఇలాంటివి రౌడీయిజాన్ని కొనసాగానీయను ఇలాంటి వారిపై చట్టపరమైన కేసుల నమోదు చేయాలని అక్కడున్నటువంటి వన్ టౌన్ ఎస్ఐ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని అసెంబ్లీకి కన్వీనర్ నాగరాజ్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆదూరి విజయకృష్ణ, బిజెపి జిల్లా నాయకులు ఉపేంద్ర కుమార్, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, మణికంఠ అంజయ్ కుమార్ , శివ రాజ్, కాశి, చంద్ర, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.