వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మృతిని కుటుంబానికి ఆర్థిక చేయూత

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి22 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):ఇటీవల తిమ్మరాజు చెరువు వద్ద వైజాగ్ ప్రమాదవశాత్తు కాలవలో పడి మృతి చెందిన గిడుతూరి లావరాజు కుటుంబానికి వివేకనంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు, చినశంకర్లపూడి మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీను ఆర్థిక సహాయంతో బియ్యం బస్తా, ఊరగాయలను ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాయుడు చిన్న, వివేకానంద సేవా సమితి సభ్యుడు పెండ్యాల రాజు, స్థానికులు బత్తుల నాగేశ్వరరావు,జుత్తుల శ్రీను, తూరాల లోవరాజు, వాతాడ డేవిడ్ రాజు,నల్లమాటి పండు,నిమ్మాది బుజ్జిబాబు లు పాల్గొన్నారు.