వైష్ణవి దేవి ఆలయంలో వసంత నవరాత్రులు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 22.03.2026 మదనపల్లి అన్నమయ్య పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం వసంత నవరాత్రుల్లో మూడవ రోజున ఆలయ అర్చకురాలు శ్రావణి అమ్మవారికి ఉదయమే పంచామృత అభిషేకం చేసి అనంతరం అమ్మవారిని రంగు రంగు పూలతో అలంకరించారు, చౌడేపల్లి ,పుంగనూరు ,మదనపల్లి, రాయచోటి గ్రామ ప్రజలు అమ్మవారి సన్నిధిలో సౌందర్యలహరి ,లలితా సహస్రనామం పారాయణం చేశారు. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.