పయనించే సూర్యుడు మార్చి 22 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని మండల పరిధి లోని గనేకల్ గ్రామం నుండి భారతీయ జనతా పార్టీలోకి భారీ ఎత్తున ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో చేరారు. వైసిపినుండి బీజేపీ లో చేరిన వారిలో ముఖ్యంగా లక్ష్మారెడ్డి , హనుమయ్య విశ్వనాథ రెడ్డి ,ఎం బంగారయ్య ,సాయిబాబా నరసయ్య, తిమ్మప్ప నారాయణ ,లక్ష్మయ్య, నాలుగవ వార్డు మెంబర్ సూరి ,తిక్కయ్య ,ఎం లక్ష్మయ్య , అంజి , దాసరి ఓబులేష్ గ్రామ బీజేపీ నాయకులు పెద్ద కొండయ్య, చిన్న కొండయ్య ఆద్వర్యం లో చేరారు.ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆదోని నియోజకవర్గం లో చేస్తున్న అభివృద్ధి నచ్చి బీజేపీ లో చేరుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమం లో పాల్గొన జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్, అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ ,నాయకులు కిరణ్, శివ, అంజాయ్, కాశీ, నాగరాజు ,భీమేష్ తదితరులు.