శాస్త్రోక్తంగా పాలెం వెంకన్న దేవాలయంలో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు.

సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్న 20 మంది దంపతులు.

పయనించే సూర్యుడు మార్చి 22 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలెర్మెల్ మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం చైత్రమాసం శుక్ల తదియ శనివారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది కుటుంబాలు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.సూక్ష్మంలో మోక్షమార్గము పొందుటకు అతి తక్కువ ఖర్చులో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించవచ్చునని భక్తులకు తెలిపారు.కోరిన భక్తులకు ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. శ్రీబాలాజీ అన్నదాన సత్రంవారి ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాద పంపిణీ చేసినట్లు డాక్టర్ పి.గోపాల్,శేఖర్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు జయంత్ కుమార్,శుక్లా, ఆలయ సిబ్బంది బాబయ్య, శివకుమార్,భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *