శేరిలింగంపల్లిలో ఘనంగా రంజాన్ వేడుకలు: ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్

పయనించే సూర్యుడు, మార్చి 21 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) రంజాన్ పవిత్ర పండుగను పురస్కరిం చుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని పలు డివిజన్లలో ముస్లిం సోదరు లకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్. శనివారం నియోజకవ ర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, ముస్లిం సోదరుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పండుగ శుభాకాంక్షలు అందజేశారు.ఈ సందర్భం గా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడు తూ.. "రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు సోదరభావానికి ప్రతీక అని, నియోజకవర్గంలోని ప్రజలం దరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నా రు.ముస్లిం సోదరులు ఆయనను సాద రంగా ఆహ్వానించి, పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్త లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.