సాలూరలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు.

★ ఈద్గాల వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 22 సాలూర : సాలూర ముస్లిం మైనార్టీ సోదరులు శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకొని పండగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఉదయాన్నే ముస్లిం మైనార్టీ సోదరులు ఈద్గాల వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం ఒకరిని ఒకరు అలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.మండల పెద్దలు,ప్రజా ప్రతినిధులు,పలు పార్టీల నాయకులు ఈద్గాల వద్దకు వచ్చి ముస్లిం మైనార్టీ సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.