పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 22 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్
తొగుట మండల కేంద్రంలోని తుక్కపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.తదనంతరం చిక్కుడు ఉపలయ్య ఇందిరమ్మ ఇళ్లు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిక్కుడు మస్టి కళావతి స్వామి,ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి ఏఎంసి కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), సర్పంచ్లు పాగాల శోభా కొండల్ రెడ్డి,వార్డ్ సభ్యులు గొడుగు మురళి,రమేష్,గ్రామ పార్టీ అధ్యక్షులు బరెంక్కల స్వామి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉల్లెంగుల సాయి ముదిరాజ్, సీనియర్ నాయకులు చిలివేరి రాంరెడ్డి, నిరంజన్ రెడ్డి,బండారు రమేష్ గౌడ్,భారత్ తేజ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు