ఆదోనిలో దాడులు చేస్తే ఊరుకునేది లేదు:- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి

పయనించే సూర్యుడు మార్చి 23 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఆదోనిలో అభం శుభం తెలియని వారిపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. శనివారం ఆదోని పట్టణంలోని గౌలిపేట కింది గేరీ నందు ఇటీవల గాయ పడిన బోయ రామును ఇంటికి వెళ్ళి పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మాట్లాడుతూ యువత అనవసమైన గొడవలకు వెళ్ళకూడదని అన్నారు. బాధ్యత తెలిసి తెలియని వయస్సులో మీరు చిన్న గొడవలను పెద్ద గొడవలగా మార్చుకొని నష్ట పోయేది మీరు మీ కుటుంబం ఎంత బాధ పడుతుందొ ఆలోచించాలని తెలియజేశారు. గొడవలు పడి పోలీసు స్టేషన్ రికార్డ్ లలో ఎక్కితే అవి జీవితకాలం వెంటాడు తాయని తెలిపారు.ఇవాళ ఆదోని లో ఎవరికి చిన్న ఇబ్బంది జరిగిన నేను నేరుగా వెళ్ళి వారి యోగ, క్షేమాలు తెలుసుకుంటున్నానని అన్నారు, ఒక పై ఎవరు కూడా ఇంకొక్క వ్యక్తి పై దాడి చెయ్యడానికి వీలు లేదని హెచ్చరించారు.నేను ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం ఆకతాయిల ఆటలు సాగవు తప్పుకు తగ్గ శిక్షలు తప్పని సరిగా ఉంటాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *