ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ కార్యదర్శిగా‘దామా స్వరూప’ నియామకం

పయనించే సూర్యుడు మార్చి 23 మధిర ప్రతినిధి మధిర :టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంలో జిల్లా కార్యదర్శిగా 'దామా స్వరూప' నియమితులయ్యారు. పార్టీ కార్యక్రమలల్లో చురుగ్గా పాల్గొనడం, పార్టీ పట్ల చూపుతున్న నిబద్ధత తో పాటు ఆమె చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించింది. ఈ సందర్భంగా దామా స్వరూప మాట్లాడుతూ తన నియామకాన్ని స్వాగతిస్తున్నానని, త్వరలో బాధ్యతలు చేపట్టి పార్టీ ఆదేశాలు, సూచనల మేరకు జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింతగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు, సంక్షేమ పథకాలను అర్హులైన అందరికి చేరేలా కృషి చేస్తామన్నారు. తన నియామకానికి​ సహకరించిన ఖమ్మం డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, ఖమ్మం టౌన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రామసహాయం రఘురామ రెడ్డి గారు రేణుక చౌదరి, తుమ్మల యుగంధర్, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జావిద్, సౌజన్య, దయాకర్ రెడ్డి, లతో పాటు రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి దామ స్వరూప ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ​​దామా స్వరూప నియామకం పట్ల జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు, మహిళా విభాగం నాయకులు మరియు కార్యకర్తలు, ఇల్లూరు గ్రామ పెద్దలు, యువకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఆమె నియామకం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, ముఖ్యంగా మహిళా కార్యకర్తల సమన్వయానికి ఇది ఎంతో దోహదపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.