గుంతలే గుంతలు… ప్రయాణం ప్రమాదకరం, గ్రామాల్లో రోడ్డునిర్బంధం

"రోడ్లు వేయాలని వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది"

పయనించే సూర్యుడు మార్చి 23 రాజేష్) దౌల్తాబాద్–రాయపోల్ మండలాల్లో రోడ్ల దుస్థితిపై ప్రజల ఆగ్రహం, రోడ్డునిర్బంధం దౌల్తాబాద్ మరియు రాయపోల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ల దుస్థితి రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డునిర్బంధానికి దిగారు. గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా గుంతల మయంగా మారిపోవడంతో ఆటోలు, బస్సులు వంటి రవాణా సదుపాయాలు సక్రమంగా నడవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని రోడ్ల గురించి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున రోడ్డు నిర్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ప్రత్యేకంగా హైమద్నగర్ నుంచి నాచారం వరకు ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారిందని ప్రజలు పేర్కొన్నారు. కొనాయిపల్లి, మల్కాపూర్, బేగంపేట్, ఎల్కల్, అపాయిపల్లి, వడ్డేపల్లి, మాచిన్‌పల్లి తదితర గ్రామాల ప్రజలు ఈ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అయిన రఘునందన్ రావు మరియు కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎల్లబోయిన కరుణాకర్, మంకిడి స్వామి, సాయి రెడ్డి, పోసాని దినేష్, రంజిత్, ఎన్ కుమార్, పి రవి, ఎన్ రాజు, ప్రశాంత్, నవీన్, యాదగిరి తదితర యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుర్రాల సొప వద్ద రోడ్డునిర్బంధం నిర్వహించగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను సముదాయించి పంపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు