పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 23 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో నారా మరియు నల్లమిల్లి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, ఒక ఆత్మీయ బంధంగా కొనసాగుతోంది. తరాలు మారుతున్నా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న నమ్మకం, గౌరవం చెక్కుచెదరకుండా ఉండటం నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నమ్మకానికి నిలువుటద్దం: చంద్రబాబు నాయుడు స్వయంగా ఏరికోరి రాజకీయాల్లోకి తీసుకువచ్చిన వ్యక్తుల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరు. మూలారెడ్డి వారసుడిగా రాజకీయ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నా ఆసక్తి చూపని రామకృష్ణారెడ్డి, కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్న గౌరవంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన సామర్థ్యంపై ఆది నుండి చంద్రబాబు నాయుడుకు అత్యంత నమ్మకం ఉంది. సంక్షోభంలోనూ చెదరని విధేయత: 2024 ఎన్నికల సమయంలో పొత్తుల కారణంగా అనపర్తి ఎమ్మెల్యే టికెట్ విషయంలో కొన్ని మార్పులు జరిగినప్పటికీ, రామకృష్ణారెడ్డి ఎక్కడా అసహనం వ్యక్తం చేయలేదు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి, పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన చూపిన సహనం, స్వామిభక్తి నారా కుటుంబ సభ్యులను ఆకట్టుకుంది. చంద్రబాబు నాయుడుతో పాటు లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సైతం నల్లమిల్లి కుటుంబంపై ఎనలేని అభిమానం పెరగడానికి ఇదే ప్రధాన కారణం. రాజకీయాలకు అతీతంగా ఆత్మీయత: రామకృష్ణారెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ, నారా కుటుంబంతో ఉన్న సంబంధాలు ఏమాత్రం తగ్గలేదు. "మీ వారు బీజేపీలోకి వెళ్లినా మీరంతా మా మనుషులే" అంటూ చంద్రబాబు నాయుడు చమత్కరించడం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తోంది. లోకేశ్ సైతం గౌరు కుటుంబంతో మాట్లాడుతూ "మా రామకృష్ణారెడ్డి బిడ్డను మీ ఇంటికి పంపుతున్నాం, జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పడం విశేషం. ఇంటి ఆడబిడ్డను అప్పగించేటప్పుడు ఉండే ఆత్మీయత వీరి మాటల్లో కనిపించింది. విధేయతకు దక్కిన గౌరవం: అధినేతల నుండి రాజకీయాలకు మించిన ప్రేమాభిమానాలను పొందిన ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిలిచారు. ఒకవైపు బీజేపీలో ఎదుగుతూనే, టీడీపీ అధినేతల మనసుల్లో చెరగని ముద్ర వేసుకోవడం ఆయన క్రమశిక్షణకు, విధేయతకు అద్దం పడుతోంది. రాజకీయాల్లో నమ్మకానికి, నిబద్ధతకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒక నిలువుటద్దంగా నిలిచారు.