పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 23 బోధన్: బోధన్ పత్రీజీ జన్మస్థలం నుండి ఈనెల 29న నిజామాబాద్ జరగబోయే మెగా మహాకరణ శాఖాహార ర్యాలీకి అందరూ రావాలని ఆదివారం బోధన్ పిరమిడ్ మాస్టర్స్ పత్రీజీ జన్మస్థలం నుండి పలు గ్రామాలకు వెళ్లి కరపత్రాలను చూపించి ప్రతి ఒక్కరు ఈ శాకాహార ర్యాలీలో పాల్గొనాలని మూగజీవుల సంరక్షణ కోసం ఈ మహా అద్భుత లోక కళ్యాణం కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోధన్ పిరమిడ్ మాస్టర్లు అన్నారు. జగద్గురు శ్రీ బ్రహ్మార్షి పితామవా పత్రీజీ దివ్య ఆశీస్సులతో అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన లక్ష్యం మానవులు ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా కావడమే ఒక్కడిగా బోధన్ లో జన్మించి ఈరోజు లక్షలమందిగా శాఖాహారులుగా మారడం జరిగింది. మానవుల హారం శాఖాహారం అని ఎ జీవిని చంపే హక్కు మనకు లేదని నినాదాలు చేసుకుంటూ కరపత్రాలు ప్రతి గ్రామాల్లో ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు.