పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 23.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, రాజవొమ్మంగి మండలానికి నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన లతశ్రీ.మండల పరిషత్ అధ్యక్షురాలు గోము వెంకటలక్ష్మి శనివారం మర్యాదపూర్వకంగా. కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ భేటీలో స్థానిక నాయకులు వెంకటేష్ రాజు, కుశరాజు, వీరబాబు, ఈక శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖతో సమన్వయం కొనసాగిస్తూ మండలంలో శాంతి భద్రతలను బలోపేతం చేయాలని, ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎస్సై లతశ్రీ, చట్టపరమైన విధానాలను అనుసరిస్తూ. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.