వాడిక వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 23 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని వేంచేసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు చతుర్థి వార్షిక బ్రహ్మోత్సవములు రేపు సోమవారం అనగా 23/03/2026 స్వామివారికి ఉత్సవ కార్యక్రమములు నిర్వహించడం జరుగుతున్నది కావున భగవత్ బంధువులందరూ గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పత్రికా మిత్రులు యువతి యువకులు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కుల మత బేధ తారతమ్యం లేకుండా రాజకీయాలకు అతీతంగా అంకిత భావంతో ప్రతి ఒక్కరు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని, ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి సుప్రభాత సేవ ప్రాతఃకాల సేవ ఆరాధన విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం అంకురారోపణ ధ్వజారోహణం ఉత్సవమూర్తులకు అభిషేక కార్యక్రమములు సుదర్శన హోమం స్వామివారి కల్యాణ మహోత్సవం అనంతరం తీర్థప్రసాధముల వితరణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించెదరు భక్తులందరు స్వామి వారి మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *