శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ పాలకవర్గ చైర్మన్ గా నాయి బ్రాహ్మణులకు ఇవ్వాలి

★ రాజకీయాలకతీతంగా నాయి బ్రాహ్మణ వర్గానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి ★ నాయి బ్రాహ్మణుల నాదస్వరం తోనే స్వామి వారు మేల్కొంటారు. స్వామివా వారు నిద్రిస్తారు. ★ స్వామి వారికి నిత్య కైంకర్యం ములు ఎక్కువగా చేసేది నాయి బ్రాహ్మణులే.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 23 జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తిరుమలగిరి గ్రామంలో ఉన్న శ్రీ వల్మికోద్బవ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ పదవి నాయి బ్రాహ్మణులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యుల వారిని కోరుతున్నాము. ఇప్పుడు కేవలం ఒక నియామకం కాకుండా, స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది. చైర్మన్ పదవి కాలం ముగియడంతో కొత్త ఎంపికపై గ్రామస్థులు, పార్టీ నాయకులు, వివిధ సామాజిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కైకర్యాలలో ఎక్కువ కాలం ఎక్కువ సమయం స్వామి వారి సేవలో నిమగ్నం ఐ కైకర్యాల నిర్వహించేది నాయి బ్రాహ్మణులు. అట్టి నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వారికి చైర్మన్ పదవి ఇవ్వాలని రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నాయి బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వాలి.? స్వామివారి పాద సేవ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు స్వామివారికి తెల్లవారుజామునే నిత్య కైంకర్యాలు ప్రారంభించే ముందు స్వామివారికి నాదస్వరం ఊదితేనే ఆ స్వామివారి గర్భాలయ తలుపులు తెరుసుకొని స్వామి వారికి బ్రాహ్మణోత్తములు నిత్య కైంకర్యములు చేస్తూ ఉంటారు. అలాంటి నాయి బ్రాహ్మణులకు ఈ అవకాశం ఇవ్వాలి. దేవాలయంలో తెల్లవారుజాము నుండి సాయంకాలం స్వామి వారి నిద్రించే వరకు కూడా నిత్యం నాయి బ్రాహ్మణు లు నాదస్వరంతోను క్షవరశాలలోనూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వామివారి ప్రతి సేవలోనూ నాదస్వరం సన్నాయి,డోలు వాయించినదే కార్యక్రమాలు చేయరు. కాబట్టి అందుకు నాయి బ్రాహ్మణులకు స్వామివారి ఆలయ చైర్మన్ పదవి ప్రథమముగా నాయి బ్రాహ్మణులకు ప్రథమ స్థానం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది గత ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వం ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు వారు నాయి బ్రాహ్మణులకు స్వామివారి దేవాలయాల్లో ఏర్పాటు చేస్తున్న పాలకమండలిలో ఒక ప్రముఖ స్థానాన్ని తప్పనిసరిగా డైరెక్టర్ పదవిని నాయి బ్రాహ్మణులకు కేటాయించారు. అందుకు నాయి బ్రాహ్మణ కుల సంఘాలు అందరూ వారికి అభినందనలు తెలుపుతున్నారు.అందుకనే ఇప్పటివరకు జగ్గయ్యపేట మండలంలోని తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనేక వర్గాల నుండి ప్రాతినిధ్యం కల్పించారు. కావున ఈసారి మా నాయి బ్రాహ్మణులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యేని కోరుతున్నాము. రాజకీయం గాను మేము అభివృద్ధి చెందాము. ఇప్పటికే తమిళనాడులో రెండు దశాబ్దాల కాలం పాటు మా నాయి బ్రాహ్మణులు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలం.రాజుల కాలం నుండి నాయి బ్రాహ్మణులే వైద్యులు గా ఉంటూ అనేక రంగాలలో ఉన్నత స్థానాలకు ఎదిగి నేడు రాష్ట్ర ప్రభుత్వాల్లో రెండు అగ్ర పార్టీల ముఖ్యమంత్రిలు కూడా నాయి బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించి తిరుపతి దగ్గర నుంచి తిరుమలగిరి వరకు అనేక దేవాలయాల్లో వారికి ప్రముఖ స్థానాన్ని కల్పించడం ఆనందదాయకం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పాలకమండలిలో కూడా మా నాయి బ్రాహ్మణులకు ప్రముఖ స్థానం కల్పించారు. అదే స్ఫూర్తితో చైతన్యంతో తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ చైర్మన్ కావాలని అడుగుతున్నాం. మీకు ఇష్టమైన వారికి ఎవరికైనా సరే నాయి బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలని మా కోరిక. విద్యాధికులు నాయి బ్రాహ్మణులు అనేకమంది ఐఏఎస్ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, విద్యావేత్తలు సామాజికవేత్తలు డాక్టర్, ఇంజనీరింగ్, దేవాలయ కార్యనిర్వహణాధికారులుగా ఇంకా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది విద్యాదికులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పండితులు అనేక రంగాలలో ఉన్నారు. మేము చైతన్యవంతుల మవు తున్నాము. కాబట్టి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏ విషయంలోనూ తీసుకోలేదని అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన మా నాయి బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని జగ్గయ్యపేట శాసనసభ్యులు వారిని కోరుకుంటున్నాము.
అదేవిధంగా ఈ ప్రాంతంలో హిందూ ధర్మం కోసం గత 25 సంవత్సరాలుగా ధర్మ ప్రచారం చేస్తూ, దేవాలయాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై 25 సంవత్సరాల గా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న హిందూ ధర్మం పోరాటయోధుడు వల్లాపురపు. వెంకటబాబు. నాయి బ్రాహ్మణ కులము నుండి విద్యావేత్త,ఆధ్యాత్మికవేత్త సంఘ సేవ, దేవాలయ కేంద్రంగా అనేక సేవలు చేస్తూ, కరోనా కష్టకాలంలో 66 రోజులు వివిధ దేవాలయాల వద్ద ఉన్నటువంటి పేదవారికి స్వామి వారి చెంతనే ఉండి ఉండేవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది., మీడియా రంగంపై పట్టు ఉన్న వ్యక్తి, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ధర్మ ప్రచారకులుగా 20 సంవత్సరాలు హిందూ ధార్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ అనేక దేవాలయాల నిర్మాణంలో తన పాత్రను పోషిస్తూ దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియారూపంలో వెలుగులోకి తీసుకువచ్చిన వ్యక్తి సొంత పత్రిక ,సొంత చానల్ కలిగియున్న వ్యక్తి దేవాదాయ శాఖలో బాటమ్ టు టాప్ వరకు తెలిసిన వ్యక్తి వల్లా పురపు వెంకట బాబు కూడా నాయి బ్రాహ్మణుల కులమునకు చెందిన వ్యక్తికి కావడం వలన ప్రముఖంగా పోటీపడుతున్నారు.