అకాల వర్షంతో రైతులు కన్నీరు మున్నీరు

* ప్రభుత్వం రైతులని ఆదుకోవాలి * నేడు నందిగామ మండలంలోని పరిశీలించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు _ * మొక్కజొన్న కి తీవ్ర నష్టం వాటిల్లింది * ప్రభుత్వం ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం అందించాలి.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు _ఎన్టీఆర్ జిల్లా /జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 24 _నందిగామ మండలంలో మాగల్లు రామిరెడ్డిపల్లి గ్రామాలలో ఇటీవలే కాలంలో అకాల వర్షం ఈదులుగాలతో మొక్కజొన్న పంట పూర్తిగా నేలరాళ్లటంతో రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించిన పరిశీలించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షం తోటి మొక్కజొన్న పంట పూర్తిగా నేలకు‌ వారికి రైతులకు తీవ్ర నష్టాన్ని దాల్చింది. సంబంధిత వ్యవసాయ అధికారులు మంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఎకరా ప్రతి ఎకరంకు 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2400/- కు కొనుగోలు చేయాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మొక్కజొన్న ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.1500/- కు మాత్రమే దళారీలు రైతుల దగ్గర కొంటున్నారు. రైతులు ఇప్పటికీ చేతికి వచ్చిన మొక్కజొన్నను భద్రపరుచుకొనే స్థలం లేక కొందరు, అప్పుల బాధతో కొందరు దళారీలకు తెగనమ్ముకొంటున్నారు. మార్కెట్లో కనీస మద్దతు ధర రూ.2400/- లభించక పోవటం వలన రైతులకు క్వింటాకు సుమారుగా రూ.1000/- నష్టం వస్తుంది.కావున మొక్కజొన్న రైతులను వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం అందించకపోతే ప్రజా రైతు ఉద్యమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రేఖ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు కొమ్మినేని రవిశంకర్, జడ్పిటిసి సభ్యులు గాదెల వెంకటేశ్వర్లు(బాబు), రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్, జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి దేవినేని రామారావు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గుంటి అనిల్, నియోజకవర్గ విద్యార్థి, ఐటి విభాగాల అధ్యక్షులు కటారపు నవీన్, బండి రంజిత్, పట్టణ సోషల్ మీడియా యువజన విభాగ అధ్యక్షులు రామిని ఉపేందర్ రెడ్డి, సయ్యద్ సైదాలి, కొండూరు గ్రామ పార్టీ అధ్యక్షులు దేవినేని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *