అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైస్ బ్యాగ్ ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరణ.

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 24 దేశం కోసం, దేశా స్వాతంత్రం కోసం బలిదానం చేసిన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ప్రాణత్యాగానికి గుర్తుగా వారిని స్మరిస్తూ ఈరోజు బలిదాన్ దివాస్ సందర్భంగా మన ప్రాంతంలోని ఎవరు ఆకలితో బాధపడకుండా ప్రతి ఒక్కరికి ప్రతి రోజు అన్నాన్ని (అన్నదానం) అందించాలనే ఉద్దేశ్యంతో మెట్పల్లి పట్టణ అర్ డి ఓ నరసింహ రావు చేతులమీదుగా రైస్ బ్యాగ్ ఛాలెంజ్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. నిరు పేదలకు, రోజు కూలీలకు, హాస్పిటల్ కు వచ్చే పేషెంట్ లకు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కడుపునిండా భోజనం పెట్టాలనే ఉద్దేశ్యంతో రైస్ బ్యాగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పుల్ల జగన్, బండరీ శివ, పొన్నం శ్రీనివాస్, పారిపెళ్లి హరీష్, వేముల శివ, ఉదయ్ కుమార్, తోట అజయ్ తదితరులు పాల్గొన్నారు.