పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినారి కాలనీ-24 భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు అసెంబ్లీ ముట్టడి పిలుపునివ్వగా రామగిరి మండలం లో భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ముందస్తు అరెస్టు చేయడం సరైనది కాదని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు తీగల శ్రీధర్, బిజెపి జనరల్ సెక్రెటరీ కమలాకర్, సీనియర్ నాయకులు మెరుగు శ్రీకాంత్, దంతుల సురేష్, అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు