ఆదర్శమూర్తి శ్రీరాముడు : యల్లటూరు శ్రీనివాసరాజు

పయనించే సూర్యుడు-24-03-2026-రాజంపేట న్యూస్ : తండ్రి మాట నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు వనవాసం చేయడంతో పాటు అడుగడుగునా ధర్మం పాటించి మానవుడు ఎలా జీవించాలో చూపించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. రాజంపేట నియోజకవర్గం లోని మాధవరం గ్రామంలో బోడగల వంశీలకు చెందిన ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామ మందిరంలో సోమవారం శ్రీ సీతారాముల వారికి వైభవోపేతంగా జరిగిన కళ్యాణ మహోత్సవానికి వారి ఆహ్వానం మేరకు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు, గ్రామానికి చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యల్లటూరు మాట్లాడుతూ శ్రీ సీతారాముల అనుగ్రహంతో రాజంపేట నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల టిడిపి సీనియర్ నాయకులు మరియు మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య, ఒంటిమిట్ట మండల టిడిపి సీనియర్ నాయకులు మామిళ్ళ ఈశ్వరయ్య, ఒంటిమిట్ట మండలం సింగల్ విండో మాజీ అధ్యక్షులు నందిమండలం దనుంజయ రాజు, టిడిపి రాష్ట్ర డాక్టర్ సెల్ కార్యదర్శి డాక్టర్ గాద, శివకుమార్, మాధవరం నాయకులు చింత గింజలు సుబ్రమణ్యం, బోడుగుల చంద్రబాబు, సూర్య బాబు, జొన్నదల రామ్మోహన్, మాజీ జెడ్పిటిసి బోడగల అనంతరామయ్య, బోడుగుల హరి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *