ఆదోనిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేయాలి – బీజేపీ నాయకులు

పయనించే సూర్యుడు మార్చ్ 24 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీన్ మాధవ్ ఆదేశాల మేరకు ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి సూచన మేరకు ప్రతి సోమవారం జరిగే జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదోని మండల అధ్యక్షులు పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో, పార్వతమ్మ అమ్మవారి దేవాలయం , అభయ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ మునిసిపాలిటీ ఖాళీ స్థలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రతిష్టాపనకు అనుమతి ఇవ్వాలని ఆదోని సబ్ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ధైర్యం, స్వరాజ్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం ద్వారా యువతకు స్ఫూర్తి కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉండి వినియోగం లేకుండా ఉందని, ఆ స్థలంలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీ గోడ నిర్మాణం, మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించడం, ప్రదేశాన్ని శుభ్రంగా అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు చేపడతామని వివరించారు.కావున, సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *