ఎమ్మెల్యే నానాజీ కృషితో పండూరు చెరువుకు మహర్దశ..

పయనించే సూర్యుడు మార్చి 24, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ - పిఠాపురం జాతీయ రహదారికి ఆనుకొని కాకినాడ నగరానికి సమీప గ్రామమైన పి. వెంకటాపురంలోని పండూరు మంచినీటి చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్న కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ అభినందనీయులని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పండూరు చెరువును ఆధునీకరణ కోరుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే పంతం నానాజీ ఇటీవల వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు .దీంతో పండూరు చెరువు అభివృద్ధికి మార్గం సుగగమైందని అన్నారు. పండూరు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణంతోపాటు చుట్టూ మొక్కలు పెంచడం, చిన్నారులు ఆడుకునేందుకు పరికరాలు, సిమెంట్ బెంచీలు, సోలార్ లైట్లు, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలు కల్పించి నగర, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక పర్యాటక ప్రాంతంగా ఆహ్లాదాన్ని కలిగించే రీతిలో తీర్చిదిద్దును న్నారని అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను పరిష్కరించడమే గాక నియోజకవర్గంలో తన పేరు చిరస్థాయిగా నిలవాలనే తపనతో బీచ్ పార్కును అభివృద్ధి చేసిన రీతిలో ప0డూరు చెరువును అభివృద్ధి చేయనున్నట్లు అడబాల తెలిపారు.