ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 24 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ):స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరావు,సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిడిపి యువ నాయకులు బోదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి హాజరై మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు.కీర్తిశేషులు వాగు రాజారావు,మీనాక్షిల కుమారుడు వాగు లక్ష్మణరావు జ్ఞాపకార్థంగా వాగు రాజేష్ ఆర్థిక సాయంతో సోమవారం ఏర్పాటు చేశారు.అనంతరం చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ వేసవికాలం రావడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ,ప్రతిరోజు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.అలాగే ప్రతినెల 9వ తారీఖున ఆస్పత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి హాస్పటల్ అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు శిరీష,లావణ్య,సుప్రియ,రాధా కుమారి,కూటమి శ్రేణులు మామిడి లలిత, రాయుడు చిన్న, బుగత శ్రీను, సామoతుల గోపి,గొల్లపూడి త్రిమూర్తులు,వాగు బద్రిష్,ఊర నానాజీ, కోరాడ కృష్ణ, ఉదగిరి కామేశ్వరరావు, చలంచర్ల నాగేశ్వరరావు,స్కూల్ చైర్మన్ శ్రీను,నేతి నాగేశ్వరరావు, బూడి సూరిబాబు, ఆస్పత్రి సిబ్బంది ప్రమీల,చక్రవర్తి,వివేకానంద సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.