పయనించే సూర్యుడు మార్చి 24 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) జనగామ జిల్లా దేవరుప్పుల మండలకేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ప్లాంటు నిర్మాణం చేసి పిల్లలందరూ సురక్షితమైన నీరును త్రాగాలన్న ఉద్దేశంతో పాఠశాలలోని బడి పిల్లలకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయురాలు రాగి స్వప్న అధ్యక్షత వహించగా అతిథిగా దేవరుప్పుల మండల గ్రామ పంచాయతీ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లలందరూ ప్లాస్టిక్ రహిత సమాజానికి నాంది పలకాలని,ప్లాస్టిక్ వాడకం వలన నేటి సమాజంలో క్యాన్సర్ రావడానికి కారణభూతం అవుతుందని,అలాగే సమాజంలో పెస్టిసైడ్స్ మందులు వాడకం వలన సురక్షితమైన జలనిధి కేంద్రాలు కలుషితమై ఫ్లోరైడ్ నిధి క్షేత్రాలుగా ఏర్పడి పుట్టిన పసి గుడ్డు నుండి పెద్దవాళ్ల వరకు అనేక రకాల సీజనల్ వ్యాధులకు గురవుతూ కాళ్ళ కీళ్ల నొప్పులతో,నానా రకాల అనారోగ్యాలకు గురవుతూ ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని, ఈ క్లోరైడ్ రైతు సమాజం నుండి,ప్లాస్టిక్ రహిత సమాజం నుండి మనం ముందుకు రావాలంటే ప్లాస్టిక్ ను వ్యతిరేకిద్దాం సురక్షితమైన మాత్రమే త్రాగుదాం అని తెలిపారు.కమ్యూనిటీ ఈ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలందరికీ స్టీల్ వాటర్ బాటిల్స్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ చెవిటి శ్రీను,ఉపాధ్యాయులు చంద్రశేఖర్, శ్యామల, చింత ప్రవీణ్, కమలాకర్,తదితరులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.