కరూర్ వైశ్యా బ్యాంక్ నందిగామ వారి సౌజన్యంతో కియోస్క్ మిషన్లు శ్రీయుత కార్యనిర్వహనాధికారి బి మహేశ్వరరెడ్డి

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 24 పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా తేదీ 23-03-2026 శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిపోలు నందు భక్తుల మెరుగైన సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా దేవస్థాన ప్రాంగణం లో కరూర్ వైశ్యా బ్యాంక్ నందిగామ వారి సౌజన్యంతో కియోస్క్ మిషన్లు శ్రీయుత కార్యనిర్వహనాధికారి బి మహేశ్వరరెడ్డి మరియు బ్యాంక్ మేనేజర్ వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది . ఈ కియోస్క్ మిషన్లు ద్వారా ఆన్లైన్ లో అప్పటికి అప్పుడు ఫోన్ పే గూగుల్ పే మరియు ఇతర యుపి ఐ యాప్స్ ద్వారా దర్శనం టికెట్స్, సేవలు బుక్ చేసుకొనుటకు అవకాశం కలదు. భగవంతుని సేవ భక్తునికి మరింత చేరువలో ఉండాలని లక్ష్యం తో ఈ మిషన్లు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సౌకర్యమును భక్తులు ఉపయోగించుకొనవలసినదిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బి మహేశ్వర్ రెడ్డి తెలియజేసినారు ఈకార్యక్రమంలో మాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు బ్యాంకు సిబ్బంది దేవస్థానం సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *