పయనించేసూర్యుడు.న్యూస్.24. మార్చి పుల్కల్ మండల ప్రతినిది పెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా ఉమ్మడిపుల్కల్ మండలంలొని కోర్పోల్ గ్రామంలో కే.పి.యల్. క్రికేట్ టౌర్నమేంట్ నిర్వహించారు ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి హజరైనారు.అయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్య జీవితంలో క్రీడా మరియు వ్యాయామాలు ఎంతో ముఖ్యం ఇదే క్రీడా స్పూర్తితో ఇంకా ఎన్నో మ్యాచులు ఆడి ఇంకా ఎత్తుకు ఎదగాలని భవిష్యతులో ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్న తన సేవలు మీకు ఎల్లవేళలా ఉంటాయి అని భిక్షపతి. అన్నారు ఈ మ్యాచ్లో కె.పి.ఎల్ లో రన్నర్ గా సూర్యవంశీ టీం, విన్నర్ గా జాన్సీ టీం గా నిలిచారు వారికి మెమొంటో లు అందచేసి శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్గానైజర్స్ సోహెల్, రామకృష్ణ, మురళి,మాణిక్యం. కోర్పోల్ గ్రామ సర్పంచ్ సునీత ప్రవీణ్ రెడ్డి, ఉమ్మడి పుల్కాల్ మండల మాజీ ఎం.పీ.పీ.చైతన్య విజయ్ భాస్కర్ రెడ్డి ,బి.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు ఉదయ్ బాబుమోహన్,మండల పార్టీ అధ్యక్షులు శివకుమార్,నాయకులు,గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.